పుతిన్‌తో మోదీ భేటి

4

తాష్కెంట్‌ ,జూన్‌ 24(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఉజ్బెకిస్థాన్‌ లోని తా ష్కంట్‌ లో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని? అక్కడ పుతిన్‌ ను కలిశారు. అనంతరం మోడీ, పుతిన్‌ తో పాటూ ఇరు దేశాల ప్రతినిధులు ద్వైపాక్షిక సంబం ధాలపై చర్చించారు. పౌర అణుశక్తి, గ్యాస్‌, పెట్రోకెమికల్‌ రంగాల్లో పర స్పర సహకారంపై చర్చ జరిపారు. అంతరిక్ష రంగం, వ్యాపార వాణ ిజ్య రంగాల్లో రెండు దేశాలకు ఉన్న అవకాశాలను

చర్చించారు. భారత్‌-రష్యా మధ్య ప్రాచీనకాలం నుంచి ఉన్న సాంస్కృతిక సంబంధాలను ఈ సందర్భంగా మోడి-పుతిన్‌ గుర్తుచేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు.భారతదేశం తమకు ప్రత్యేకమైన భాగస్వామి అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. రెండు దేశాల మధ్య సుధీర్ఘ కాలంగా స్నేహం ఉందన్నారు.

పుతిన్‌ తో సమావేశం ముగిసిన తర్వాత దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి విగ్రహం దగ్గర మోడీ నివాళులు అర్పించారు.అలాగే తజకిస్థాన్‌, బెలారస్‌ దేశాధినేతలను కలిశారు.  తజకిస్థాన్‌ అధ్యక్షుడు ఎమొమలీ రెహమాన్‌, బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాశెంకోతో మోడీ వేర్వేరుగా సమావేశమయ్యారు. అలెగ్జాండర్‌ తో భారత్‌, బెలారస్‌ ల మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల అంశంపై చర్చించారు. అనంతరం ఎమొమలీ రెహమాన్‌తో సమావేశమై తజకిస్థాన్‌, భారత్‌ల మధ్య సత్సంబంధాలు, శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, ఇతర కీలక అంశాలపై చర్చించారు.