పునరావాస కేంద్రాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, నవంబర్12: రాష్ట్రంలోని వరదముంపునకు గురైన కోస్తా జిల్లాలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు తదితర పునరావాస సామాగ్రి తీసుకువెళ్ళే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ‘రాహుల్ సేవ’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ, దానం లింగమూర్తి ట్రస్ట్ సహకారంతో దాతల నుండి సామాగ్రిని సేకరించారు. మంత్రి దానం నాగేందర్ నేతృత్వంలో ఈ సామాగ్రి సేకరణ, జిల్లాలకు పంపే ఏర్పాట్లు జరిగాయి. మంత్రులు వట్టి వసంతకుమార్, విశ్వరూప్, ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సోషల్ యాక్టివిస్ట్ అక్కినేని అమల, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.