పురుగుల మందు పిచికారీ చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది*
పెన్ పహాడ్ అక్టోబర్ 23 (జనం సాక్షి) :మండల పరిధిలోని పోట్లపహడ్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులపై చెట్లనుండి పురుగులు పడి దద్దుర్లు రావడంతో జనం సాక్షి పత్రిక లో “పాఠశాల విద్యార్థులపై పురుగులు పది దద్దుర్లు”పట్టించుకోని అధికారులు స్థానిక పాలకులు”అనే వార్త కథనం ఈనెల 18న ప్రచురణ కావడంతో స్పందించిన ఎంఇఓ నకిరేకంటి రవి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శీనయ్య,స్థానిక ప్రధానోపాధ్యాయులు రేణుక దేవి సూచనల మేరకు గ్రామ సర్పంచ్ రామినేని పుష్పవతి కృష్ణయ్య సహకారంతో పాఠశాలలోని చెట్ల పైన ఉన్న బొంతు పురుగులు (కొమ్ము పురుగుల) నివారణకు పురుగుమందును గ్రామ పంచాయతీ సిబ్బంది చేత పిచికారీ చేయించారు తాత్కాలిక చర్యలు కాకుండా పాఠశాలలో అవసరం లేని కాలం తీరిన పెద్ద చెట్లను తొలగించి విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలం ఉండేలాగా శాశ్వత చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు కోరుతున్నారు.