పులికుంట వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరికి గాయాలు
రెబ్బన, జనంసాక్షి: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం పులికుంట సమీపంలో గురువారం ఉదయం ఆటో అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు సింగరేణి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లికి చెందిన ఆర్. మల్లేష్. రాంబ్రహ్మంలు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 సాయంతో బెల్లంపల్లి ఏరియా ఆస్పతికి తరలించారు.



