పులిట్జర్ అవార్డు గ్రహీత ఫిలిప్ రోత్ కన్నుమూత
వాషింగ్టన్,మే23( జనం సాక్షి): ప్రముఖ అమెరికన్ రచయిత, పులిట్జర్ అవార్డు గ్రహీత ఫిలిప్ రోత్(85) మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని స్నేహితుడు తెలిపారు. 1991లో ప్రాచుర్యం పొందిన ‘పాట్రిమోని’తో సహా ఆచన 30 పుస్తకాలను రాశారు. ఈ పుస్తకం నేషనల్ అవార్డును, అమెరికన్ పాస్టోరల్ అవార్డును గెలుచుకొంది. ఆయన 1998లో పులిట్జిర్ అవార్డును గెలుచుకున్నారు. 2011లో మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని కూడా అందుకున్నారు.