పుస్తకావిష్కరణ అడ్డుకున్నవారిని అరెస్టు చేయండి

సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో విశాలాంధ్ర మహాసభ ఫిర్యాదు

హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ నిర్వాహకులు సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే తమపై దాడికి దిగిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో ‘రుజువులు లేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకొని ఆందోళన చేసిన విషయం తెలిసిందే.