పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య
వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి) :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం పూర్తయితే ఉమ్మడి  జిల్లాలో అన్ని  మండలాలకు నల్లానీరు సరఫరా కానుంది. మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతిగ్రామంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మిషన్‌ భగీరథతో నీళ్లు ఇళ్లల్లోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టారు.  ఇకపై ఏజెన్సీ ప్రజలు కలుషిత నీటిపై ఆధారాపడాల్సిన అవసరం లేకుండా  రూపకల్పన చేశారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. గోదావరి జలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో కలుషిత నీరే దిక్కు. వాగులు వంకలు, చెలిమల విూద ఆధారాపడి ఏజెన్సీప్రజలు జీవించే వారు. వేసవి వచ్చిందంటే ఏజెన్సీ గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవించే వారు.  కలుషితమైన వాగులు, వంకల నీరు తాగడం వల్ల తరచూ డయోరియాకు గురై మృత్యువాత పడే వారు. ఇప్పటికే 80శాతం పనులు పూరైనట్లు అధికారులు చెబుతున్నారు.  పైపులైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇంటింటికి మంచినీటి సరఫరా పథకం సాకారం కానుంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు వరం కానుంది.