పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్
బ్యాక్ వాటర్ ముప్పుపై ప్రజల ఆందోళన
ఆదిలాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్ రంగారావు జలాశయ నిర్మాణానికి పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం చొరవతో ఏడాది కిందట నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమై చివరిదశలో ఉన్నాయి. ఈ
జలాశయం చివరన ఉన్న గుండెగాం గ్రామంలోకి నీరు రాకుండా వరదనీటికి అడ్డుకట్ట నిర్మించనున్నారు. గ్రామం పక్క నుంచి ప్రవహించే సుద్దవాగు వరదనీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదముంది. అయితే జలాశయ నిర్మాణంలో భాగంగా నీటిపారుదలశాఖ అధికారులు గ్రామం పక్కనే వరదనీటి కట్ట నిర్మించేందుకు
సన్నద్ధమవుతున్నారు. దీంతో ప్రయోజనం కన్నా గ్రామానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటితో మరో ముప్పు వాటిల్లే ప్రమాదముంది. వరదనీటి ముప్పు గురించి విన్నవించినా నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులకు జలాశయం పనులు అర్ధంతరంగా ఆగడంతో సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.
మరికొన్ని నెలల్లో పనులు పూర్తి కావొస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో కురిస్తే గ్రామంలోకి వరదనీరు వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యను ముందే గుర్తించిన నీటిపారుదలశాఖ ఇంజినీర్లు వరదనీరు రాకుండా గ్రామానికి 100 విూటర్ల దూరంలో ఉన్న సుద్దవాగు మధ్యలో వరదనీటి కట్ట
నిర్మించనున్నారు.జలాశయ నిర్మాణం పూర్తి కావస్తున్న వేళ గుండేగాం గ్రామానికి జలాశయ బ్యాక్‌వాటర్ ముప్పు ఉందని ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరద నీరు గ్రామంలోకి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. అయితే జలాశయ నిర్మాణం
ముంపు సర్వే ప్రకారం గుండేగాం గ్రామానికి జలాశయ బ్యాక్‌వాటర్ ముప్పులేదని నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులు అన్నారు. సుద్దవాగుపై గ్డడెన్న జలాశయ నిర్మాణం చేపట్టినప్పుడు సర్వే చేసిన ఇంజినీర్లు ప్రకటించిన ముంపు గ్రామాలు, భూములకు నిర్మాణం పూర్తయిన అనంతరం ముంపు ప్రాంతం
పెరిగింది. నాడు చుచుంద్, సాంవ్లీ, నిగ్వా గ్రామాలను అధికారులు ముంపు గ్రామాలుగా ప్రకటించలేదు. జలాశయం పూర్తయి బ్యాక్‌వాటర్ ఆ గ్రామాలను ముంచెత్తితే గ్రామస్థుల ఆందోళనతో ముంపుగా ప్రకటించి పరిహారం చెల్లించారు. ఇంజినీర్లు తప్పుడు సర్వేలు చేపట్టిన కారణంగా గ్రామానికి ఆ దుస్థితి
రాకూడదంటే ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముందే మేల్కోవాలని గ్రామస్థులు అంటున్నారు.ముందు జాగ్రత్తగా గ్రామానికి దగ్గరలోని సుద్దవాగు వరదనీరు గ్రామంలోకి రాకుండా, నీటిమట్టాలు గుర్తించి రెండింటికి మధ్య కట్ట నిర్మించాల్సి ఉందన్నారు. దిగువన జలాశయం నిర్మాణంతో వరదనీటి నిల్వతో మా
గ్రామం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే రెండు ఒర్రెల నీరు గ్రామాన్ని ముంచెత్తుతుంది. అయితే నీటి పారుదలశాఖ అధికారులు గతంలో నిర్వహించిన సర్వేలో గ్రామానికి ముప్పులేదని తేల్చారు.