పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

సప్తగిరికాలనీ, జనంసాక్షి: మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బలహీన వర్గాల ప్రతినిధులతో పూలేజయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన

వర్గాలన్నీ ఏకతాటిపై వచ్చి ఐక్యతను చాటాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 5న జగ్జీవన్‌ రామ్‌, 11న మహాత్మాపూలే , 14న అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీసీ వెల్ఫేర్‌ డీడీ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్‌, మాజీ మేయర్‌ శంకర్‌, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌, బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌ శ్రీధర్‌రాజు, యాదవ, పద్మశాలీ సంఘాల అధ్యక్షలు నర్సయ్య, సత్యం , మాధవ్‌, ప్రకాశ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.