పెంచిన “గ్యాస్” ధరలకు నిరసిస్తూ.. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మహా ధర్నా

మిర్యాలగూడ, జనం సాక్షి
గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కారుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుదలపై బిఆర్ఎస్ పిలుపుమేరకు శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. “బిజెపి కో హటావ్.. దేశ్ కో బచావో… తదితర నినాదాలతో మహిళలు, కార్యకర్తలు హోరోత్తించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాస్తూ సామాన్యులకు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి పడుతున్న సామాన్యులకు గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై మరోసారి భారం పడిందన్నారు. మహా ధర్నా కార్యక్రమం అనంతరం వంటవార్పు చేశారు. మహాధర్నా కార్యక్రమంలో మిర్యాల మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీలు నందిని రవితేజ, బాలు నాయక్, కౌన్సిలర్లు ఉదయభాస్కర్, సలీం, కుర్ర చైతన్య, స్రవంతి, చింతపల్లి సర్పంచ్ లలితా సక్రు నాయక్, సర్పంచ్ అశోక్ రెడ్డి, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, వీర కోటిరెడ్డి, ఎండి యూసుఫ్, కరుణాకర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, వింజం రాజేంద్రప్రసాద్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఫహీముద్దీన్, షహనాజ్ బేగం, మదార్ బాబా, సాదినేని శ్రీనివాసరావు పూనాటి లక్ష్మీనారాయణ, వెంకన్న, వజ్రం, ఏడుకొండలు, మిట్టపల్లి సైదులు యాదవ్, రాములు గౌడ్, పూసపాటి రాజయ్య,హబీబ్, వినోద్ నాయక్, ఫయాజ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.