పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బిఆర్ఎస్ అధ్వర్యంలోధర్నా
పెనుబల్లి, మార్చ్3(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలు పెంచటం పై నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం, ఎమ్మెల్యే సండ్ర పిలుపుమేరకుశుక్రవారం పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో వి ఎం బంజర్ రింగ్ రోడ్డు సెంటర్ లో నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు, పెంచిన గ్యాస్ ధర లను వెంటనే తగ్గించాలని పార్టి నాయకులు , కార్యకర్తలు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్ల తో నినాదాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు , మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకటరావు,వియం బంజర్ గ్రామ సర్పంచ్ భూక్య పంతులి, పెనుబల్లి గ్రామ సర్పంచ్ తావు నాయక్, పెనుబల్లి ఎంపీటీసీ చీపు లక్ష్మీకాంతం, భూక్య ప్రసాద్, మందడపు అశోక్, కనగాల సురేష్ బాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులుచీకటి రామారావు, లక్కినేని వినీల్, వంగా చంద్రశేఖర రావు, నీలాద్రి ఆలయ పాలకమండలి సభ్యుడు వంగా సురేష్ ( చిన్న పండు ) తేళ్ళురి నాగేశ్వరరావు, ఎస్కే గౌస్, యలమర్తి శ్రీనివాసరావు, కోమటి వెంకటేశ్వరరావు, కోమటి ప్రసాద్, గువ్వల వెంకటరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.