పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.
సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేకర్ రావు.
నేరేడుచర్ల జూలై 07(జనంసాక్షి )న్యూస్:గృహ వినియోగదారులపై పెంచిన గ్యాస్ ధర 50 రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు డిమాండ్ చేశారు.గురువారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయం అరిబండి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో ఇప్పటికే 244 రూపాయలు గ్యాస్ ధర పెంచారని, పేదోళ్లను కొట్టి పెద్దలకు దేశ సంపదను మోడీ దోచిపెడుతున్నారని,2014లో 500 రూపాయలు ఉన్న గ్యాస్ ధర గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో డబుల్ రెట్లు అధికంగా 600రూ పెంచిందని గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెంచుతూ సామాన్యులపై మోయలేని భారం పడుతుందన్నారు.వీటితోపాటు నిత్యవసర సరుకులు వంట నూనెలు పప్పులు,కూరగాయల రేట్లు విపరీతంగా పెంచి సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి నెలకొంది అన్నారు.పెరిగిన ధరలను నియంత్రించడంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యారని కెసిఆర్ మోడీ ఇద్దరూ దేశాన్ని రాష్ట్రాన్ని బడా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధంగా వీరి విధానాలు ఉన్నాయని అన్నారు.పెరిగిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నాగేష్ టౌన్ నాయకులు కుంకు తిరుపతయ్య నీల రామ్మూర్తి,యడ్ల సైదులు,ఎస్.కె మదర్, తదితరులు పాల్గొన్నారు.