పెగాసస్‌పై బెంగాల్‌ విచారణ కమిషన్‌


నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పెగసస్‌ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో తాజాగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ’పెగసస్‌’ పై విచారణ కమిషన్‌ ను ఇటీవల బెంగాల్‌ సర్కార్‌ నియమించింది. అయితే పెగాసస్‌ వ్యవహారంపై విచారణ కమిషన్‌ ను నియమించడంపై బెంగాల్‌ సర్కారుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్‌ నేతృత్వం లో ఇద్దరు సభ్యుల కమిషన్‌ విచారణ ను నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ద్విసభ్య కమిషన్‌ విచారణ నిలుపుదల చేయాలంటూ ’ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ దాఖలు అయ్యాయి. పెగసెస్‌ కుంభకోణం పై విచారణ కు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఇతర పిటీషన్ల తో కలిపి విచారణ జరుపుతామన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ నేపథ్యం లోనే ద్విసభ్య కమిషన్‌ వేసిన పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.