పెట్టుబడులకు రెడ్ కార్పెట్
చారిత్రక ఘట్టానికి హైదరాబాద్ వేదిక
టీఎస్ ఐపాస్‌కు బడా పారిశ్రామిక వేత్తలు
నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన సర్కారు
హైదరాబాద్,జూన్12(ఆర్‌ఎన్‌ఎ): పెట్టుబడిగారులకు రెడ్‌కార్పెట్ పరుస్తూ తెలంగాణ సర్కారు రూపొందించిన పారిశ్రామిక విధానం ప్రారంభోత్సవానికి హైదరాబాద్ లోని హెచ్‌ఐసిసి వేదికగా మారింది. తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేసింది. దేశ,విదేశాలకు చెందిన పారిశ్రామక దిగ్గజాల సమక్షంలో ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. హెచ్.ఐ.సి.సిలో ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్ లాంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ టీఎస్ ఐపాస్‌ను కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని తెలిపారు. ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందన్నారు. . దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, అవినీతికి తావులేకుండా అనుమతుల మంజూరు చేయడం తమ విధానమని ఆయన పేర్కొన్నారు. భూమి, నీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 150 పారిశ్రామికవాడలు, 28 సెజ్‌లు ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు లక్షా 60 వేల ఎకరాల భూమి ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. కోరుకున్న చోట, కావాల్సినంత భూమి. అన్ని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా, వాటర్‌గ్రిడ్ పైపులైన్ల ద్వారా ప్రాజెక్టుల నుంచి చాలినంత నీరు, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, రెండు వారాల్లోగానే అనుమతులు మంజూరు ఇందులోని ప్రధాన అంశాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు, పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉంటారు. ఇందులోని విశేసాలను గమనిస్తే సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా సాగుతారు. అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ రింగురోడ్డు, ప్రతీ జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి నాలుగు లేన్ల రహదారులు,నూతన పారిశ్రామిక విధానం విధివిధానాలు వరం కాబోతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు లక్షా 60వేల ఎకరాల భూమి సిద్ధం చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం ఇందులో ప్రధాన నిర్ణయంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, రెండు వారాల్లోగా అనుమతుల జారీ, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే చేజింగ్ సెల్ ఏర్పాటు వల్ల పరిశ్రమలు స్థాపించే వారికి వరంగా మారనుంది.
తెలంగాణ పారిశ్రామికాభివృద్దికి నూతన టీఎస్ ఐసాస్ విఆనం ఎంతగానో తోడ్పడుఉతందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇక్కడ పరిశ్రమలకు అనుమతులను త్వరగా అందచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు వందశాతం కరప్షన్ ఫ్రీతో అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రధానంగా విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని అన్నారు. హైదారబాద్ నగరంలోని హెచ్.ఐ.సి.సిలో టిఎస్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. మాదా నూతన పారిశ్రామిక విధానాన్ని, టీఎస్‌ఐపాస్ వెబ్‌పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ఓ బృందాన్ని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.8 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఐటీసీ సంస్థ ముందుకు వచ్చినందుకు గర్వంగా ఉందని అన్నారు. పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని, దరఖాస్తు చేసుకున్న రెండువారాల్గో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం టీఎస్ ఐపాస్ సోలార్ బుక్ పాలసీ రిలీజ్‌ను అదేవిధంగా ఆన్‌లైన్ అప్లికేషన్ వెబ్ పోర్టల్‌ను లాంచ్ ఆవిష్కరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తున్నాం. పారిశ్రామికవేత్తల దరఖాస్తులను పరిశీలించి అధికారులు మళ్లీ సంప్రదిస్తారు. పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లో అనుమతులు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమల అనుమతులపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. మా అధికారుల బృందం అన్నీ దగ్గరుండి చూసుకుంటుందన్నారు. పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తాం. పరిశ్రమలకు అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం. పారిశ్రామికవేత్తల నుంచి స్వయం ధ్రువీకరణ పత్రాలకు ప్రాధాన్యం ఇస్తాం. . పరిశ్రమల స్థాపనకు పైరవీలు అక్కర్లేదంటరూ కొత్త విధానం ప్రకారం పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు తగిన సెక్యూరిటీ కల్పిస్తాంమని, పెట్టుబడుల ఆకర్షణ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. క్రైం రేటు తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. పోలీసు వ్యవస్థను ఆధునీకరించామని అన్నారు. నగరంలో లక్షా 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఇకపోతే తెలంగాణ ఏర్పడ్డ తరవాత విద్యుత్ విసయంలో తీసుకున్న చర్యలను వివరించారు. తెలంగాణలో కోతలు లేకుండా చేశామన్నారు. ఇందుకుజెన్‌కో ఛైర్మన్ ప్రభాకర్ రావు, ఆయన సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పారిశ్రామిక దిగ్గజాలతో పాటు మంత్రుల జూపల్లి కృష్ణారవు, జగదీశ్వర్ రెడ్డి, కెటి రామారావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.