పెట్రో ధరలపై భగ్గుమన్న లెఫ్ట్
ఎపి వ్యాప్తంగా ఆందోళనలు
విశాఖపట్టణం,జూన్9(జనం సాక్షి ): పెట్రో, వంటగ్యాస్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆంద్వర్యంలో ఎపి వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిచారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో జాతీయ రహదారిపై వామాపక్షల ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింగరావు, సిపిఎం కేంద్ర కవిూటి సభ్యులు వి.శ్రీనివాసరావు తదితరలు పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గి మూఖం పడుతున్నా, దేశంలో ధరలు బారీగా పెరగడం దారుణమన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చెరస్తామని హెచ్చరించారు.
విజయవాడలో నేతల అరెస్ట్
పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షల ఆద్వర్యంలో విజయవాడ పాత బస్‌స్టాండ్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, ఐద్వా రాష్ట్రకార్యదర్శి రామదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జనసేన నాయకులు పోతిన మహేష్, పార్థసారధి, రాస్తారోకోలో పాల్గన్న వామపక్ష నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుకు నిరసనగా శనివారం విజయవాడలో పాతబస్టాండ్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆదాయాన్ని పెంచుకునేందుకు అదనంగా వసూలుచేస్తున్నాయని.. సిపిఎం మధు విమర్శించారు. పాకిస్థాన్‌లో పెట్రోలు లీటరు రూ.25 విక్రయిస్తుంటే ఇండియాలో మాత్రం రూ.84 ఏమిటనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేకాలం వచ్చిందని సిపిఎం కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ తమ పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ప్రతిఘటన తప్పదని వామపక్షాలు హెచ్చరించాయి. సామాన్యుల జేబులు కొల్లగొట్టి ప్రభుత్వాలు బొక్కసాలు నింపుకుంటున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, త్వరలోనే పెట్రోల్ ధర రూ.100దాటుతుందని సిపిఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ధరలు తగ్గించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంచి గఅహిణులపై భారం మోపారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూని మోడీ నిలబెట్టుకోలేదన్నారు. ధరలు తగ్గించకపోగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు.
పశ్చిమలో వినూత్న నిరసన
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో సిపిఎం ఆద్వర్యంలో శనివారం పెట్రోల్, డీజిల్ పెంపును నిరసిస్తు సైకిల్‌కు ఆటోకట్టి వినూత్న నిరసన తెలిపారు. ఈ నిరసనలో సిపిఎం మండల నాయకులు టి.సత్యనారాయణ, ఎ.మురళి, లక్ష్మణ్, బుజ్జి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో లెఫ్ట్ నేతల ఆందోళన
పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షల ఆద్వర్యంలో తిరుపతిలో రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి చేపల మార్కెట్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు విశ్వనాద్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ధరలు పెంచారు, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని బిజేపి హావిూ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజల్, నిత్యవసర ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా తగ్గి మూఖం పడుతున్నా, దేశంలో ధరలు బారీగా పెరగడం దారుణమన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉదఅతం చెరస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీ, గురుప్రసాద్ తదిదరులు పాల్గొన్నారు.
మార్కాపురంలో రాస్తారోకో
పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా
మార్కాపురం పట్టణంలో సిపిఐ, సిపిఎం, సిఐటియు,ఎఐటియుసి జనసేన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మార్కాపురం కోర్టు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అందే నాసరయ్య మరియు రామిరెడ్డి సిపిఎం జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి సోమయ్య రఫీ మహిళా నాయకురాలు కళావతి జనసేన నాయకులు రమేష్ బాబు చంద్రశేఖర్ ఆదినారాయణ ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.