పెదప్రజలకు మేరుగైన వైద్యసేవలు అందించాలి.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డా. జి. చంద్రయ్య.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ డా. జి. చంద్రయ్య పర్యటించి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రిలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ప్రశంసించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు కమిషన్ కు సంప్రదిస్తే సెక్షన్ 12 ప్రకారం అట్టి సమస్యలకు పరిష్కరించడం జరుగుతుందన్నారు.డాక్టర్లు తల్లి లాంటి వారని డబ్బులను ఆశించకుండా పేద ప్రజలకు మంచి వైద్య సేవలను శ్రద్ధ, క్రమశిక్షణతో అందించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు.స్థానిక పాఠశాలల్లో మారుగు దొడ్ల పరిశుభ్రత కొసం స్కావెంజర్ ఏర్పాటుకు మరియు జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్ లు, నర్సుల కొరతను సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు వారికి చెందాల్సిన హక్కులు సరిగా అందుతున్నాయా లేదా అని రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు, కారాగారాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహలను సందర్శించి పరిష్కరించడం జరుగుతుం దన్నారు. ఆసుపత్రిలో మహిళా వార్డును, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆసుపత్రిలో గల రోగులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అడిగి తెలుసుకొని ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నందుకు సంతృప్తి వ్యక్తపరిచారు. తాండూర్ లో రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో 350 బెడ్స్ ఉన్నాయని, ప్రతిరోజు దాదాపు 1200 మంది రోగులు వివిధ రకాల వైద్య సేవలు పొందుతున్నారని, అలాగే ప్రతి రోజు 18 నుండి 20 ప్రసావాలు, ప్రతి నెల 500 నుండి 600 వరకు ప్రసవాలు నిర్వహించి 70 శాంతం సాధారణ ప్రసవాలు చేయడం జరుగుతుంద న్నారు. అంతేగాక డయాలైసెస్, వివిధ రకాల రోగులకు వైద్య సేవలు అందించడం జరుగు తుందని చైర్మన్ సంబంధిత వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆసుపత్రిలో అధికారులతో కలసి మొక్కలు నాటారు. ఆసుపత్రిలో అంతకు ముందు జిల్లాలో వృధాప్య, వితంతు పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయా అని అలాగే ధరణి సమస్యల పరుష్కారం లాంటి సమస్యలు మానవ హక్కుల క్రిందికి వస్తాయని వీటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆత్మ హత్యలు, వయో వృద్దులపై దాడులు జరుగకుండా ప్రజలలో మానవత విలువలు పెంపొందేలా, మానవ హక్కుల చట్టంపై న్యాయ పరమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం చదివితే గీత, ఖురాన్, బైబిల్ చదివినట్లేనని అన్నారు. అందుకు 5వ తరగతి నుండే విద్యార్థులకు రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలలో పొందుపర్చాలని అన్నారు.
అనంతరం స్థానిక యస్ వి ఆర్ గార్డెన్స్ లో ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజషన్ వారి ఆధ్వర్యంలో మానవ హక్కుల చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రెవిన్యూ డివిజనల్ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పలాన్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి శంకర్, తహసీల్దార్ అప్పల నాయుడు,అద్యక్షులు ఆరవింద్, శివశంకర్, డి యస్ పి శేఖర్ గౌడ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.