పెద్దంపేటలో జాయింట్ సర్వే చేపట్టిన సింగరేణి, రెవెన్యూ అధికారులు
జనంసాక్షి, రామగిరి : ఆర్జీ టు పరిధిలోని ఓసిపి త్రీ విస్తరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం మంగళపల్లి, పెద్దంపేట గ్రామాలను సింగరేణి తీసుకొని నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పెద్దంపేట పట్టా లో 1.12 ఎకరాల్లో ఉన్నటువంటి 53 ఇళ్లకు నష్టపరిహారం చెల్లించలేదని పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి, రెవెన్యూ అధికారులు గురువారం ఇంటింటికి తిరుగుతూ జాయింట్ సర్వే నిర్వహించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ జాయింట్ సర్వేలో భూ సేకరణ అధికారి బి.జయణ
నాయబ్ తహసీదర్ తిరుపతి
సీనియర్ అసిస్టెంట్ నిహారిక,
సర్వేయర్ ( డిఐ) గణపతి, ఆర్ ఐ రాజబాబు, అర్జీ టు ఎస్ ఓ టు జి ఎం సలీం, ఎస్టేట్ అధికారి సింగరేణి సర్వేయర్ సురేష్ బాబు, సింగరేణి సర్వేయర్ దేశాయ్ బాస్కర్, గ్రామ సర్పంచ్ చింతపట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.