పెద్దకొండూరును సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
చౌటుప్పల్ : నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామంలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఏర్పాటు చేసిన వలస కార్మికుల పిల్లల క్యాంపును సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి, మునుగోడు ఎమ్మెల్యే యాదిగిరిరావు, ఆర్వీఎం పీవో బాబు బుక్యా, డీఈవో అచార్య జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.