పెద్దపల్లికి చేరిన సీపీఎం పోరాట సందేశ్‌ జాత

పెద్దపల్లి: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా సీపీఎం చేపట్టిన పోరాట సందేశ్‌ జాత ఈ రోజు పెద్దపల్లికి చేరింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్తు సర్‌ఛార్జీలను ఉప సంహరించుకోవాలని కరెంటు కోతలను ఎత్తివేయాలని కోరారు. విద్యా, వైద్యా సర్వీసుల ప్రైవేటీకరణను నిలిపి వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.