పెద్ద చింతకుంట సర్పంచ్ పై గ్రామ‌స్తుల ఫిర్యాదు

విచారణ చేసిన అధికారులు
నర్సాపూర్. ( జనం సాక్షి):
పల్లె ప్రగతి పనులలో చేయని పనులకు చేసినట్లుగా  బిల్లులు  చేసుకొని నిధులు డ్రా  చేయ‌డంతో ఆ  సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు  అధికారుల‌కు ఫిర్యాదు చేసిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని పెద్ద‌చింత‌కుంట గ్రామంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం ప‌ల్లెల అభివ‌ద్ది కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన   పల్లె ప్రగతి పనులలో చేయని పనులకు చేసినట్లుగా బిల్లు చేసుకొని నిధులు డ్రా  చేయ‌డంతో  పెద్ద‌చింత‌కుంట గ్రామ   సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు గ‌త కొన్ని  రోజుల క్రితం   అధికారుల‌కు ఫిర్యాదు   చేశారు.  స్పందించిన అధికారులు  బుధవారం నాడు  నర్సాపూర్ మండలం  పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తుల సమక్షంలో విచారణ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు  రికార్డులను క్షుణ్గా  పరిశీలించారు.  చేసిన పనుల వివరాలు చదివేటప్పుడు గ్రామస్తులకు సర్పంచ్ వార్డు సభ్యులకు తీవ్ర వాగ్వాదం జ‌ర‌గ‌డంతో గ్రామంలో  ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు లపై వచ్చిన ఆరోపణలపై పూర్తి విచారణ అనంతరం నిజనిర్ధారణ చేసి చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవోలు తెలిపారు. కాగా  చేయని పనులకు చేసినట్లుగా రికార్డులు చూపిన సర్పంచ్, సహకరించిన ఉపసర్పంచ్, సెక్రటరీలను సస్పెండ్ చేయాలని గ్రామ‌స్తులు  డిమాండ్ చేశారు

తాజావార్తలు