పెయింటింగ్ కార్మికుడి కుటుంబానికి మంజూరైన భీమా చెక్కుఅందజేత
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుడు షేక్ సలీం ఇటీవల మరణించాడు,అతనికి వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ లేబర్ ఇన్సూరెన్స్ నుండి మంజూరైన లక్ష 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును అతని భార్యకి జానీ బేగం కు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి,కౌన్సిలర్ నూకల సుగుణమ్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో,జిల్లా ఐఎన్టియుసి బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ అధ్యక్షుడు సయ్యద్ ముస్తఫా,ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు నన్నేపంగ శ్రీనివాస్,రాజీవ్ గాంధీ పెంటింగ్ యూనియన్, ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు ఇంజమూరి జానయ్య,కార్యదర్శి పున్నయ్య,కోశాధికారి ఇంజమూరి మల్లయ్య,సందీప్,శ్రీరాములు,,నా గేష్,బిక్షం, రాజు తదితర పెయింటింగ్ కార్మికులు పాల్గొన్నారు.