పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
వేతన సంఘం ఛైర్మన్‌కు ఉద్యోగ సంఘాల వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని పదో వేతన సంఘం ఛైర్మన్ పి. కె. అగర్వాల్‌ను ఉద్యోగసంఘాలు కోరాయి. వివిధ సంఘాలు విజ్ఞాపనలు ఇచ్చేందుకు మే 30 గడువుగా నిర్ణయించడంతో సచివాలయంలో ఈ సంఘాలు పెద్ద ఎత్తున తమ ప్రతిపాదనలు సమర్పించాయి. ఉద్యోగులకు కనీసం 15 వేల రూపాయలను మూలవేతనంగా నిర్ణయించాలని ఉద్యోగ సంఘాల కోరాయి. ఫిట్‌మెంట్ కనీసం 71 శాతం ఉండాలన్నాయి. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగులకు పెరుగుదల ఉండాలని ఆ మేరకు సర్వీసు కండిషన్లను నిర్ణయించాలని కోరారు. పింఛనర్లకు కనీసం పింఛను పదివేల రూపాయలుగా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.