పెరిగిపోతున్న వీధికుక్కల బెడద గాయాల పాలవుతున్న ప్రజలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 : కుక్కలు బాబోయ్‌ కుక్కలు…జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా, ఏపట్టణంలో చూసినా ఇదే మాట. వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో పలువురు శునకాలదాడిలో గాయాలపాలై, మృత్యువాత కూడా పడుతున్నారు. కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుస్తున్నా , స్థానిక అధికారులు నిర్లక్ష్యంతో వాటిని ఖర్చు చేయకుండా సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు.కుక్కలను ఎప్పటికప్పుడు కుటుంబ నియంత్రణ చేయించాల్సి ఉండగా సంబంధిత వైద్యులు లేరని కుంటిసాకు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో కార్పోరేషన్‌తో పాటు బోధన్‌,కామారెడ్డి, ఆర్మూర్‌ మున్సిపాలిటీలు, 718 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో సుమారు 20వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలు 5వేల వరకుఉన్నాయి.కుక్క కాటు వేస్తే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించేందుకు రెబీస్‌ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి కుక్కల బారిన పడిఆసుపత్రికి వెళ్తే సంబంధిత సిబ్బంది వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ప్రయివేట మెడికల్స్‌లో రేబీస్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తూ బాధితులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయిస్తే వాటి సంఖ్యను తగ్గించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం కుక్కలకు కుటుంబ నియంత్రణ చేపట్టాలని పశువైద్యాధికారులకు ఆదేశాలను జారీ చేసినా వారు పట్టించుకోవడం లేదు.దీంతో కుక్కల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఊర కుక్కలు, కొన్ని పిచ్చి కుక్కలుగా మారి రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేసికాటు వేస్తున్నాయి. కామారెడ్డి డివిజన్‌ను పరిశీలిస్తే కామారెడ్డి మండలం అడ్లూర్‌లో కుక్క కాటుతో 8 సంవత్సరాల బాలుడు మృత్యువాత పడ్డాడు.అలాగే మండలంలోని లింగాయిపల్లిలో ఇటీవల పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి 11 మందిని గాయపర్చిన విషయం తెలిసిందే. తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు, ఎర్రాపహాడ్‌లో ముగ్గురిపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపర్చిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని మున్సిపల్‌ కేంద్రాలలో, గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఎంతో మందిని గాయపర్చడమే కాక ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. అయినా అధికారులు మాత్రంఘటన జరిగిన సమయంలోనే హడావుడి చేసిచేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయించి, వాటి ఉత్పత్తిని తగ్గించి కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రేబీస్‌ వ్యాక్సిన్‌ సైతంఅందుబాటులో ఉంచాలన్నారు.కుక్కలు బాబోయ్‌ కుక్కలు…జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా, ఏపట్టణంలో చూసినా ఇదే మాట. వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతుంది. దీంతో పలువురు శునకాలదాడిలో గాయాలపాలై, మృత్యువాత కూడా పడుతున్నారు. కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుస్తున్నా , స్థానిక అధికారులు నిర్లక్ష్యంతో వాటిని ఖర్చు చేయకుండా సమస్యను మరింత జఠిలం చేస్తున్నారు.కుక్కలను ఎప్పటికప్పుడు కుటుంబ నియంత్రణ చేయించాల్సి ఉండగా సంబంధిత వైద్యులు లేరని కుంటిసాకు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో కార్పోరేషన్‌తో పాటు బోధన్‌,కామారెడ్డి, ఆర్మూర్‌ మున్సిపాలిటీలు, 718 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో సుమారు 20వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలు 5వేల వరకుఉన్నాయి.కుక్క కాటు వేస్తే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందించేందుకు రెబీస్‌ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి కుక్కల బారిన పడిఆసుపత్రికి వెళ్తే సంబంధిత సిబ్బంది వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ప్రయివేట మెడికల్స్‌లో రేబీస్‌ వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తూ బాధితులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయిస్తే వాటి సంఖ్యను తగ్గించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం కుక్కలకు కుటుంబ నియంత్రణ చేపట్టాలని పశువైద్యాధికారులకు ఆదేశాలను జారీ చేసినా వారు పట్టించుకోవడం లేదు.దీంతో కుక్కల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఊర కుక్కలు, కొన్ని పిచ్చి కుక్కలుగా మారి రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేసికాటు వేస్తున్నాయి. కామారెడ్డి డివిజన్‌ను పరిశీలిస్తే కామారెడ్డి మండలం అడ్లూర్‌లో కుక్క కాటుతో 8 సంవత్సరాల బాలుడు మృత్యువాత పడ్డాడు.అలాగే మండలంలోని లింగాయిపల్లిలో ఇటీవల పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి 11 మందిని గాయపర్చిన విషయం తెలిసిందే. తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు, ఎర్రాపహాడ్‌లో ముగ్గురిపై పిచ్చికుక్కలు దాడి చేసి గాయపర్చిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని మున్సిపల్‌ కేంద్రాలలో, గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఎంతో మందిని గాయపర్చడమే కాక ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. అయినా అధికారులు మాత్రంఘటన జరిగిన సమయంలోనే హడావుడి చేసిచేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేయించి, వాటి ఉత్పత్తిని తగ్గించి కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రేబీస్‌ వ్యాక్సిన్‌ సైతంఅందుబాటులో ఉంచాలన్నారు.

తాజావార్తలు