పెళ్లిపీటల మీద నుంచి పరారైన వరుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడవాల్సిన వరుడు పెళ్లి పీటల మీద నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బోరబండలో చోటు చేసుకుంది. రూ. 5లక్షల కట్నం తీసుకుని వరుడు నరేష్‌ ఉడాయించాడు. పెళ్లికూతురు బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసునట్లు తెలుస్తుంది.