పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
చిగురుమామిడి: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు ఒక యువతి బైఠాయించింది. మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో చిట్టెంపల్లి శ్రీనివాస్ అనే యువకుడు కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన అనూష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అనూష పెళ్లి చేసుకుందామని వత్తిడి తెచ్చేసరికి ముఖం చాటేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని,పెళ్లి చేసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ ఇంటి ముందు అనూష బుధవారం బైఠాయించింది. శ్రీనివాస్ పరారీల ఉన్నాడు. గ్రామ పెద్దలు శ్రీనివాస్ తల్లిదండ్రులతో చర్చిస్తున్నారు.