పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది

రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాద్ , రూరల్ సెప్టెంబర్ 17: జనం సాక్షి

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భంలో శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు
ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల సందర్భంగా
కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర సమాచారం పౌర సంబంధాలు మరియు గనులు భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారుఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమై 76 సంవత్సరాలు పూర్తి అయినందున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడంలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపల పంపిణీ, ఆసరా పింఛన్లు , కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, కంటి వెలుగు, దళిత బంధు, విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజన లాంటి మహోత్తరమైన కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా రాష్ట్రంలో అమలు చేయడం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.రైతుల సంక్షేమ నిమిత్తం రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున రెండు లక్షల 46 వేల 285 మంది రైతులకు ఇప్పటివరకు 2 వేల 882 కోట్ల 62 లక్షల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా దురదృష్టవశాత్తు కుటుంబాన్ని పోషించే యజమాని మరణిస్తే రైతు బీమా పథకం కింద కుటుంబానికి ఆసరగా 5 లక్షల రూపాయల చొప్పున జిల్లాల 4,640 మంది రైతులకు 232 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని అందించడం జరిగిందని మంత్రి సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు రుణభారం ఉండకూడదని సదుద్దేశంతో రుణము రుణమాఫీ పథకం ద్వారా 6493 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. రైతు సమస్యలను పరిష్కార మార్గం చర్చించేందుకు గాను శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు జిల్లాల 99 నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ పశువర్ధక రంగంలో గొల్ల కురుమ లు ఆర్థికంగా ఎదిగే దిశగా అదేవిధంగా మత్స్యకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ లో భాగంగా జిల్లాలోని 701 చెరువులకు గాను 662 చెరువులను 153 కోట్ల 95 లక్షల వ్యయంతో పూడిక తీత పనులు చేసి అభివృద్ధి పరచడం జరిగిందని మంత్రి అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు పథకం ద్వారా కుటుంబానికి 10 లక్షలు అందించడంతోపాటు లబ్ధిదారులకు అనుకొని సంఘటన జరిగినప్పుడు అండగా నిలిచేందుకు రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 30 వేల 278 మంది లబ్ధిదారులకు 351 కోట్ల 22 లక్షలు అదేవిధంగా షాదీ ముబారక్ ద్వారా 6,676 మంది లబ్ధిదారులకు 77 కోట్ల 45 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు ఇలా 10 వర్గాల చెందిన వారికి ఆసరా పథకం ద్వారా లక్ష 12 వేల 204 మంది లబ్ధిదారులకు 27 కోట్ల 46 లక్షల 58 వేల విలువగల పింఛన్లు జిల్లాలో అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించే దిశగా జిల్లాలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మంచి తెలిపారు. జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకొని మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా ఎన్నో వినూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పచ్చదనం కోసం నర్సరీల ఏర్పాట్లను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఆయన తెలిపారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారుల జీవనోపాధికి 10 వేల రూపాయల చొప్పున రుణాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా మునిసిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైకుంఠధామాలు, టాయిలెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2022-23 సంవత్సరంలో 58 కోట్ల 31 లక్షల వ్యయంతో 710 సీసీ రోడ్లను పూర్తి చేసుకోవడం జరిగిందని అలాగే 53 కోట్ల 80 లక్షల వ్యయంతో చేపట్టే 269 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వికారాబాద్ బాలికల జెడ్పి , సంగం లక్ష్మీబాయి బాలికల, బండి వెనుకచెర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థినీలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అతిధులు సాంస్కృతిక కార్యక్రమాల పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపకలను అందజేశారు.
అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా జిల్లా సమాఖ్య సభ్యులకు 247 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 50 లక్షలు రూపాయల చెక్కులను అదేవిధంగా
శ్రీనిధి ద్వారా జిల్లా సమాఖ్య సభ్యులకు 62 స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల 30 లక్షలు రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేయడం చేయడం జరిగింది.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పి కోటిరెడ్డి,ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ , జిల్లా అదనం కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు