పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

ఆపదలో ఉన్న పేద అభాగ్యులను  ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధి  ఎంతోగానో చేయూతను అందిస్తుందని జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యుడు మన్సూర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన షహనాజ్ అనారోగ్యనికీ గురి కాగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వారి విజ్ఞప్తి మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ కోప్షన్ సభ్యుడు మన్సూర్ ల సహకారం తో బాధిత కుటుంబానికి ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 40 వేలు మంజూరైనది. ఈ చెక్కు ను ఆదివారం మన్సూర్ తన చేతుల మీదుగా షార్పొద్ధిన్ కు అందజేశారు. ఈ కార్యక్రమం లో నాగయ్య గుప్తా, వంజరి యాదగిరి, వడ్ల అశోక్, హన్మంత్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
తెరాస సీనియర్ నాయకులు, చిన్నగొట్టిముక్ల గ్రామ సర్పంచ్ బాలమణి నరేందర్ మామ గుద్దేటి లక్ష్మయ్య  దశదినకర్మ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ హాజరై మృతుడి చిత్రఫటానికి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఈ చిన్నగొట్టిముక్ల ఎంపిటీసీ నువ్వుల దశరథ, సర్పంచ్ బాలమణి నరేందర్ లు పాల్గొన్నారు.