పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

తిరుమలగిరి (సాగర్) ,ఆగస్టు 26 (జనంసాక్షి): మండలంలోని చిల్కాపురం, కొంపల్లి గ్రామాలకు చెందిన 173 మంది నిరుపేద లబ్ధిదారులకు శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు భగత్ కుమార్ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశాడు ఈ సందర్భంగా భగత్ కుమార్ మాట్లాడుతూ 24 గంటల కరెంటు అందించిన ఘనత , పార్టీలకు ,కులమతాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ పథకం అమలు, గిరిజన రైతులకు పోడు భూమి పట్టాలు అందించడమే కాకుండా రైతు బంధు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఘనత బి ఆర్ఎస్ ప్రభుత్వానిదే నని,
నాయకుల సమిష్టి కృషితో గ్రామాలలో ఇళ్ల స్థలాలు , పార్టీలకు ,కులమతాలకు అతీతంగా గృహలక్ష్మి అమలు జరుగుతుందన్నారు.సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలకు అండగా కెసిఆర్ ప్రభుత్వం నిలుస్తుందని,పేదల జీవితాల్లో వెలుగులు ఉండాలంటే అందరూ మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించాలని కోరారు.2014కు ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు తెలియదన్నారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ పి యాదగిరి మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పగడాల పెద్దిరాజు , సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, రమణ ముత్తయ్య, బిచ్చునాయక్, లీలావతి కొట్యనాయక్,దేవుడు నాయక్,మల్లికార్జున్, ఎంపీటీసీ లు బాసిరెడ్డి భార్గవి శ్రీనివాస్ రెడ్డి, బగ్గు నాయక్, పెదమాము కాశయ్య ,కొత్తపల్లి శ్రీను, మొగలయ్య, కోటి, దేవస్థానం కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి, చవ్వ నాసర్ రెడ్డి, ఇరిగి గోపి, రామాంజి నాగరాజు, నర్సింగ్ వెంకన్న, బాషా నాయక్, లక్ష్మయ్య, ఒనమాలు,కట్టేబోయిన గంగరాజు, వెంకటయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.