పేదలకే సబ్బీడీ గ్యాస్
– 10 లక్షల ఆదాయ పరిమితి దాటితే రాయితీ ఉండదు
న్యూఢిల్లీ,డిసెంబర్28(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వంటగ్యాస్ సబ్సిడీలో కోత పెట్టింది. ఇక అర్హులకే సబ్సిడీని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అది కూడా ఏడాదికి పదిలక్షల రూపాయలకుపైగా ఆదాయం గల పన్నుదారులకు ఇకవిూదట సబ్సిడీ వంటగ్యాస్ వర్తించదు. సోమవారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇప్పటికే చాలామంది వంటగ్యాస్‌పై సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అర్హులైన వినియోగదారులకు సబ్సిడీ ధరలపై ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండెర్లను అందజేస్తున్నారు. ఈ పరిమితికి మించి గ్యాస్ సిలిండర్లను వాడితే వాటికి మార్కెట్ ధర చెల్లించాలి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు వేర్వేరుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర 417.82 రూపాయలు ఉండగా, నాన్ సబ్సిడీ ఎల్పీజీ ధర 606 రూపాయలు ఉంది. ప్రభుత్వం సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తోంది. కేంద్రంపై సబ్సిడీ భారం పెరుగుతున్న దశలో ఉన్నత ఆదాయ వర్గాల వారికి గ్యాస్ రాయితీ నిలిపివేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వార్షికఆదాయం రూ.10లక్షలు దాటిన వారికి గ్యాస్ రాయితీ ఇవ్వకూడదని నిర్ణయించింది. నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పేదలకు వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘గివ్‌ఇట్‌అప్’ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఉన్నత ఆదాయ వర్గాల వారికి గ్యాస్ రాయితీ నిలిపివేసేలా అడుగులు వేస్తోంది. గ్యాస్ సబ్సిడీ రద్దు చేసుకోవాలంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి అన్యూహ్య స్పందన లభించినట్లు ప్రకటించింది. దేశ్యవాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్సిడీని రద్దు చేసుకున్నారు. కోటి మంది వినియోగదారులు తమ గ్యాస్ సబ్బిడీని రద్దు చేసుకునే లక్ష్యంగా గ్యాస్ కంపెనీలు ఇప్పటికే విూడియా సాధనాల ద్వారా ప్రచార ఉద్ధృతిని పెంచాయి. దేశంలోని గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటంబానికి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్, ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీలు రాయితీపై ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున… వినియోగదారుడికి అందజేస్తుంది. అయితే ఒక్కో సిలిండర్కు రూ. 207 అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దాంతో ఏటా రూ. 40 వేల కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీ రాయితీ వదులుకుని… మరో పేద కుటుంబానికి ఆ అవకాశం కల్పించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే.