పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్‌: చంద్రబాబు

అనంతపురం: జిల్లాలో హత్యా రాజకీయాలు దారుణంగా ఉన్నాయని తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు రాస్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్‌ అని ఆయన కాంగ్రెస్‌, వైకాపాలను హెచ్చరించారు. పేదలకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వమే పరిటాల రవిని హత్య చేయించిందని ఆరోపించారు.