పేదల కోసమే సంక్షేమ పథకాలు..
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 టేక్మాల్ మండల కేంద్రము లొ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంపిణీ చేశారు. పెండింగ్ లో ఉన్న అసద్ మహమ్మద్ పల్లి దళిత బంధు లబ్ధిదారులకు ఐదుగురికి లబ్ధి యూనిట్లు పంపిణీ చేశారు, గొల్లగూడెంలో సిసి రోడ్లుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి సబ్బండవర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రజ, ఎంపీపీ చింత స్వప్న, వైస్ ఎంపీపీ మంజుల, జిల్లా కోఆప్షన్ యూసుఫ్,ఎంపీటీసీ నిమ్మ వాణి, మండల కోఆప్షన్ మజర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, అవినాష్, సిద్దయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.