పేదల సంక్షేమం కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు
గుడిహత్నూర్: ఆగస్టు (18 జనం సాక్షి)పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ వరం లాంటిదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్  అన్నారు గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని కొత్తగా మంజూరైన పింఛన్ల కార్డులు, 48, కళ్యాణ లక్ష్మీ,74, షాది ముబారక్ 8,  సీఎం రిలీఫ్ ఫండ్ 8 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు అవసరమయ్యే విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై భారం పడవద్ధని , ఆడపిల్ల పుట్టగానే చంపకుండా కే.సి.ఆర్ కిట్‌తో ఆడపిల్లలకు భరోసాగా నిల్చిందని దాని ద్వారా ఆడపిల్ల పుడితే 13000, మగపిల్లవాడు పుడితే 12000 దీనితో పాటు 15 వస్తువులు అందించి కళ్యాణం సమయంలో ఆడపిల్లలకోసం కళ్యాణలక్ష్మీ,శాదీముబారక్ ద్వారా డబ్బులు ఇస్తున్నట్లు వారన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణరాష్ట్ర ప్రభుత్వమేనన్నారు రైతుల కోసం అన్ని విధాలుగా, అన్నిగ్రామాలు, అన్నికులాలు, గౌరవించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రంలో  తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిడిఓ సునీత, సర్పంచులు జాదవ్ సునీత, కల్పన, ఎంపీటీసీలు సాగిర్ ఖాన్, కేంద్రే న్యాను, అంకతి సవిత, ఆర్ఐ చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యుడు జమీర్, టిఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, ఏఎంసీ చైర్మన్ కుడిమెత జంగు,
,నాయకులు జాదవ్ రమేష్, ప్రకాష్, దిలీప్ ఆశన్న యాదవ్ జమీల్,సోయంసతీష్ తదితరులు పాల్గొన్నారు