పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి
నర్సాపూర్. సెప్టెంబర్, 26, (జనం సాక్షి ):
టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ వేల కోట్లతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపురం మండల పరిధిలోని నతి నాయా పల్లి, కాగజ్ మద్దూర్, ఇబ్రహీంబాద్, అద్మపుర్ తదితర గ్రామాలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి తో కలిసి ఆయా గ్రామాలకు మంజూరైన పెన్షన్లు , బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భూములను సాగు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని పంట పెట్టుబడి కోసం ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి సాగు చేసే వారిని నేడు ఆ పరిస్థితి లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు ద్వారా ఎకరానికి ఏటా పదివేల రూపాయలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాబీ య నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.