*** పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌లు వరాలు **
*వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 21 … పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు జెడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత రాములు మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పడమటి మమతా నరేందర్ రెడ్డి శ్రీ మత్స్యగిరిగుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్లు సురకంటి వెంకట్ రెడ్డి చిట్టేడి వెంకట్రాంరెడ్డి టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి ఎమ్మె లింగస్వామి ఎంపీడీవో లెంకల గీతారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area