పేదింటి ఆడబిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మండలంలో బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ
రేగొండ (జనం సాక్షి): పేదింటి ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దంపల్లి, రేగొండ, తిరుమలగిరి, నారాయణపూర్, కొత్తపల్లి బి, జూబ్లీ నగర్, రామన్నగూడెం తండా, బాగిర్తి పేట, దుంపిల్లపల్లి, గూడేపల్లి, కోటంచ, మడతపల్లి, పొనగల్లు గ్రామాలలో బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై ఆడపడుచులకు చీరలు, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నాడని అన్నారు. ఆసరాలేని నిరుపేదలకు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్న ఘనత కేసిఆర్ దేనాని గుర్తు చేశారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పాఠశాల భవనాలు, స్మశాన వాటికలు, సిసి రోడ్లు నిర్మిస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని చాటుతున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ అని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని గుర్తు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మంజూరు చేయించినట్లు తెలిపారు. అన్ని రోగాలకు వైద్యం చేసే విధంగా డాక్టర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు 75 ఏళ్లుగా పరిపాలించిన పేదల బతుకులు మార్పు ఏమి లేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది ఏళ్లలోనే ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఇంగే మహేందర్, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహీం, వైస్ ఎంపీపీ కుందూరు ఉమా విద్యసాగర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, తాసిల్దార్ షరీఫ్ ఉద్దీన్, ఎంపీడీవో సురేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, కొడవటంచా ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి, బుగులోని జాతర చైర్మన్ కడారి జనార్ధన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు దాసరి నారాయణరెడ్డి, సర్పంచులు పసుల ప్రియాంక రత్నాకర్, ఏడునూతుల నిశీధర్ రెడ్డి, కట్ల రాణి మధుసూదన్ రెడ్డి, గైకోటి సునీత రవి, అడప స్వర్ణలత సుధాకర్, జంగిటి నరేష్, బానోతు భూక్య నాయక్, బొక్క భాస్కర్, మెరుగు విజయ్ కుమార్, లింగంపల్లి ప్రసాదరావు, పబ్బ శ్రీనివాస్, కుటుంబ రంజిత్, గంపల భాస్కర్, నడిపెల్లి శ్రీనివాసరావు, ఎంపిటిసిలు మైస సుమలత బిక్షపతి, శనగరం వెంకన్న, కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గంట గోపాల్, టిఆర్ఎస్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, కొలుగూరి రాజేశ్వరరావు, బలే రావ్ మనోహర్ రావు, బండి కిరణ్, కోలపాక బిక్షపతి, పట్టెం శంకర్, గంజి రజినీకాంత్, కోడెపాక మొగిలి, పెరుమండ్ల మహేందర్, చల్లగురుగుల సుదర్శన్, టిఆర్ఎస్ యూత్ నాయకులు పేరాల ప్రశాంత్ రావు, బొజ్జం ప్రవీణ్, తడుక శ్రీకాంత్ గౌడ్, యంజాల బిక్షపతి, మాడగాని నరేష్ గౌడ్ తది తరులు పాల్గొన్నారు.