పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి.

పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు.
తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి)
పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి ఎంతో మేలు చేస్తుందని పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు పేర్కొన్నారు. గురువారం
తాండూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు 8 సిఎం సహాయ నిది రెండు నారా లక్షల విలువ గలా చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగాటీఆరెస్(బిఅరెస్) పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు మాట్లాడుతూ అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్   సహాయ నిధి మంజూరు చేస్తున్నారని అన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజల జిల్లా వితాలలో వెలుగులు నింపుతుందని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుందని తెలిపారు.
మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు.
వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న  కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు ,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఠాకూర్, మరియు స్టేషన్ హనుమాన్ దేవస్థానం ఛైర్మెన్ సంజీవ్ రావు తదితరులు ఉన్నారు.
Attachments area