పేద ప్రజల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే మంచిరెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):-
యాచారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 51మంది లబ్దిదారులకు 51,05,916 రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి – షాదిముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన
 మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు,యాచారం మండలానికి ఇప్పటివరకు 14కోట్ల, 66లక్షల రూపాయల విలువ చేసిన కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేసాం అని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి కొప్పు సుకన్య,జడ్పీటీసీ జంగమ్మ యదయ్య, తహశీల్దార్ సూచరిత,డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ లు కంబాలపల్లి ఉదయశ్రీ, బండి మీది కృష్ణ, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,కంబాలపల్లి సంతోష, ఎంపీటీసీ లు డేరంగుల శారద, మెరుగు శివలీల,తెరాస మండల ప్రధాన కార్యదర్శి భాష, బిఎన్ రెడ్డి ట్రస్ట్ చెర్మెన్ బిలకంటి శేఖర్ రెడ్డి,  సహకార సంఘం డైరెక్టర్ మక్కపల్లి స్వరూప,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు