పేద విద్యార్తుల చదువుకోసం ప్రభుత్వం రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుంది: కిరణ్‌

 

సంతనూతలపాడు: పేదవిద్యార్థులకోసం చదువు కోసం 25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా సంతనూతలపాడులో ఏర్పాటుచేసిన బహిరంగాసభలో సీఎం ప్రసంగించారు. సంపాదించిన డబ్బు కోల్పోవచ్చుగాని చదువు ఎక్కడికి పోదన్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.30వేలు ఖర్చు చేస్తుందన్నారు.