పైసా ఉంటే పదవి రాదు అలా అనుకుంటే దేశానికి టాటా,బిర్లా, అంబానీ లే పరిపాలించే వాళ్ళు – శాసన సభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ -కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లు చేయలేని అభివృద్ధి కెసిఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపెట్టారు. – రైతులకు లక్ష లోపు రుణమాఫీ దీపావళి లోపే చెక్కుల రూపంలో ఇస్తాం

డోర్నకల్/ కురవి, జూలై -19 జనం సాక్షి న్యూస్: గిరిజనులకు 6 శాతం నుండి 10 శాతం రిజర్వేషన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని శాసన సభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం కురవి మండలంలోని రాజోలు, బలపాల, లింగ్యా తండా (బి) గ్రామాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కారిస్తూ ప్రజల్లో మమేకమై పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవలు, శంకుస్థాపనలు చేసిన డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్. గ్రామ గ్రామాన రెడ్యాకు డిజె సప్పట్లు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు మహిళలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంటు ఇచ్చేటోళ్లు కావాలా! బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు పంటలకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చేటోళ్లు కావాలనే దానిపై ప్రజలు ఒకసారి గమనించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లు చేయలేని అభివృద్ధి కెసిఆర్ 9 ఎండ్లో చేసి చూపెట్టిండు అని, ప్రతి గ్రామానికి రెండు పడకల ఇండ్లు, సీసీ రోడ్లు రెండు నెలల లోపే మంజూరు చేస్తామని సభ ముఖంగా తెలియజేశారు. బలపాల గ్రామం లక్ష్మీ తండా నుండి డోర్నకల్ మండలం లింబ్యా తండా గ్రామ పరిధిలోని లచ్చ తండా వరకు బీటీ రోడ్డును చేస్తావని అదే కాకుండా ప్రతి గ్రామంలోని రోడ్ల సమస్యలు లేకుండానే త్వరలోనే చేస్తామని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని, అదేవిధంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ దీపాలులోపే చెక్కుల రూపంలో అందిస్తామని ఆయన అన్నారు. లింగ్యా తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు వార్డు మెంబర్లు భూక్యా నాగేష్, మాలోత్ మోహన్, మాలోత్ బుజ్జి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే రెడ్యా కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఉప్పరిగూడెం నుండి బలపల వరకు తారు రోడ్డు రెన్యువల్ అయిందని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట లాలయ్య, ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, వివిధ గ్రామాల సర్పంచులు షేక్ మస్తాన్, ముండ్ల ప్రమీల, గుగులోతు రామ్ లాల్, లక్ష్మీ శంకర్, ఎంపీటీసీ పిట్టల రమణ, మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్ ,బిఆర్ఎస్ మండల నాయకులు రాజు నాయక్, పేర్ల గణేష్, బానోత్ గణేష్, చలగండ్ల ప్రవీణ్, బానోత్ గణేష్, సైదులు, సత్యనారాయణ, రవి, మల్సూర్, ఉప సర్పంచ్లు అనూష విష్ణువర్ధన్, లక్ష్మీనారాయణ,బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నామ సైదులు, వీరన్న, ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు