పొగాకు వాడకానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
హైదరాబాద్ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అపోలో అసుపత్రి ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు హార్లీ డేవిడ్‌సస్ మోటార్‌బైక్స్ సంస్థతో కలిసి ర్యాలీ నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రి అవరణలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల ఈ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు పొగతాగబోమంటూ బైక్ రైడర్స్‌తో ప్రతిజ్ఞ చేయించారు. పొగతాగడం వల్ల వచ్చే అనర్ధాలను అసుపత్రి నిర్వాహకులు ఓ చిన్న ప్రయోగం చేసి చూపించారు.