పొదుపు చేయండి.. లక్షాధికారిగా మారండి: జీఎం శ్రీనివాస్
నిజామాబాద్,మార్చి3(జనంసాక్షి): బీర్కూర్ సహకార కేంద్ర బ్యాంకులో ప్రతి ఒక్కరూ పొదుపు చేసి లక్షాధికారి కావాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో మంగళవారం సహకార క్రాంతి రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతినెల రూ.1500 చెల్లిస్తే 54 నెలల తర్వాత లక్షరూపాయలపైన పొందవచ్చన్నారు. దీర్ఘకాలిక అవసరాలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజు, విండో కార్యదర్శి విఠల్, సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్ గణెళిశ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే లయన్స్‌క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్న నలుగురిని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు సంపత్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండలాధ్యక్షుడు మేకల విఠల్, కార్యదర్శి ప్రభుదాస్, కోశాధికారి హన్మాండ్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.