పొద్దుపొడుపు – నడకా…… నవ్వూ….. ధ్యానం…
పూర్తిగా తెల్లారక ముందే లేచి నడ కను బయలు దేరి తే ఆ రోజంతటికీ ఆనందాన్ని చార్జి చేసుకున్నట్లు అయితది. నడక మనిషికి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ చలికాలం కాస్తా రువ్వ డిగా నడిస్తే చెమటలు వస్తాయి. ఇంటి నుంచి బయలుదేరి పోతుంటే మనలాగే నడిచే వాల్లు, పాల పాకెట్లు వేసేవాళ్ల్ల్లు, పేపర్లు వేసేందుకు తిరిగేవాళ్లు, దూర ప్రాంతాలకు ప్రయాణమై పోయేవాళ్లు ఎందరో హడావుడిగానే ఎదురవుతారు. నడుస్తుంటే ఎన్నో దృశ్యాలు కన్పిస్తాయి. ఇంటి ముందు బోల్ట్‌లు కొందరిండ్లల్లో కుక్కల అరుపులు, కొన్నికొన్ని ఇండ్ల ముందు వాకిల్లు ఊడుస్తూ కన్పిస్తారు. కొంచెం చలి, కొంచెం వెచ్చదనం,వెలుతురూ చీకటి కలెగల్సిన ఛాయ చూస్తూ చూ స్తూ మైదానంకు చేరితే ఇంకా మనసంతా హాయి. మైదానం అంతా నడిచే వాళ్లు,ఉరికేవాళ్లు పరుగెత్తేవాళ్లు , ఎవరి హడావుడిల్లో వాళ్లు ఆనందంగా కనపడుతారు. కొందరు వట్టి పాదాలతో నడిస్తే ,మరికొందరు మంచి ష్యూస్ ధరిస్తారు. స్త్రీలు, పురుషులు, నడి వయస్కులు, వయోవృద్ధులు, పిల్లలు ఎవరే మిటి ఎందరో కనవిందు చేస్తారు. పొద్దున్నే రకరకాల మనుషుల్ని చూస్తే ముచ్చటేస్తది. రోజు కనపడిన వారే తిరిగి తిరిగి కన్పిస్తారు. కండ్లతోనే పల కరిస్తారు. ఎందుకంటే అంతవరకే పరిచయాలు. మైదానంలో అక్కడక్కడా ఆసపాలు వేసేవారు, ప్రాణయోగ చేసేవాల్లు కన్పిస్తారు. కపాలఛాతి అను లోమ్, విలోమ్, బ్రామరీ ఈ విద్యలన్నీ రామ్‌దేవ్ పుణ్యమా! అని అందరికీ అబ్బినయి. కొన్ని గుంపులకు చూస్తే ఒక్కటే ముచ్చట్లు. నాలుగు రౌెండ్లు తిరిగి కొన్ని ఎక్సర్‌సైజ్ చేసేందుకు కూర్చొని జోకులు, ముచ్చట్లతోనే గడ ిపేస్తారు. ఆ ముచ్చట్లలో ఎవరేంటో కనపెట్టవచ్చు. సృజనకారులకు, వ్యక్తిత్వ వికాస పరిశీలనలకు ఆటమైదానం మంచి వేదిక. తిరిగి తిరిగి ఇంటికి వస్తుం టే కొందరు ఎదురైతారు. బయటికి వెళ్లడం అనేది ప్రపంచంలో సంబంధాన్ని కొనసాగించడం. ఎంత కొత్త ఊరికి పోయినా తెల్లారి నడక అనేది మార కుండా ఉంటేనే మానసిక ఆరోగ్యం. ఐదు గంటలకు లేవడం అంటే పది పదకొండు లోపలే పడుకోవాలే. ఈ నియమంలో పది పదిహేను రోజులు బలవంతాన నడక మొదలు పట్టనా, ఆ తర్వాత మంచం మీద మనసు పండనీయదు. తెల్లవారక ముందే పక్షులు, జంతువులన్ని లేచి బయలు దేరుతాయి. ఇట్లాగే మానవుడు కూడా నడిస్తేనే మనుగడ. పూర్వ కాలంలో నైతే గ్రామాల్లో బాయి దగ్గరకు, చెరువు దగ్గరకు తెల్లారి లేసి నడ ిచేది. బడికే నడి వెళ్లేది ఇప్పుడెక్కడ? పసి పిల్లలకు బడికి బస్సు , ఆ తర్వాత బండి, ఆ తర్వాత కారు, కాలు తీసు కాలు వేస్తే వాహ నమే. ఇక నడకెక్కడ. అందుకే నడక వీలుకాని వాళ్లు ఏదైనా పనులంటే కూడా తెల్లారి లేసి నడుస్తూవెళ్లి చేసుకోవచ్చు. డే టైంలో నడిస్తే ఎంతోమంది తెల్సినవాళ్లు కల్సి మాట్లాడుకుంట పోవచ్చు.బండి మీద జాయ్ మంటుపోతే చూసి చూడనట్టు ఎవరి స్పీడ్ డ్రైవింగ్ వారిదే అన్నట్టు ఉంటుంది. ఆగుకుంట, మాట్లాడుకుంట, చూసుకుంట కల్సినడిస్తే ఇంకా మంచిగన్పిస్తది. దగ్గర దగ్గ రున్న ఇండ్లకు, పార్టీలకు, పెండ్లిల్ల విందులకు పోయినప్పుడైనా భార్యా పిల్లలలో పాదయాత్ర చేస్తే ఇంకోరకమైనా అనుభూతి కల్గుతుంది. అన్నట్టు ఉదయాన్నే నడక ఇద్దరూ కల్సి నడిస్తే ఇంకా గమ్మతు, ఎన్నో అను భూతు లను మాట్లాడుకుంటు, పంచుకుంటు, గింజుకుంటూ వెళ్లొచ్చు.నడక మరో ప్రపంచం లెక్కన ఉంటది. అసలు మనిషి గుణమే ప్రవహించడం. నది లెక్కనే నడక ఉండాలే కాని చెరువు లెక్క ఉవడరాదు. ప్రకృతిపరంగా నడవాల్సింది పోయి వైద్యుడు నడవ మంటే రక్తపోటు, మధుమేహం ఎక్కువైతె నడవటం బల్మీటికీ జరుగుతున్నది.
మైదానంలో పడిచి నడిచీ తూర్పుకు సూర్యుడు ఉదయించే సమ యానికి చూస్తే కలిగే ఆనందం చెప్పనలవి కాదు. ప్రతి మనిషి ప్రతిరోజు పొడిచే పొద్దును చూడాలి. సూర్యుడు మెలమెల్లగా మనకు వెలుగు పంచేం దుకు వస్తున్న క్రమాన్ని గమనించాలి. చిరు లేత కిరణాలు మోముపై పడగానే విటమిన్ – డి కూడా మన శరీరంలో ప్రవహిస్తది. ఎండ పొడ పడితేనే చర్మం కింద కొవ్వు కరిగి విటమిన్- డి విడుదతై బొక్కలు గట్టి పడుతయి. నడక కోసం ఇంటి నుంచి బయటికి ఎల్లగానే స్వాగతం అంటూ కొమ్మలు ఊపే పచ్చనిచెట్లు పదే పదే పిలుస్తాయి. మైదానంలో నడుస్తుంటే చెట్టును చూస్తే ప్రాణం లేసి వస్తది.ఇంకా పూలను చేస్తే ఆ పూలమీద రాలే సీతాకోక చిలుకలు చూస్తే,తుమ్మెదలను చూస్తే కన్పించే ఉత్సాహం, ఆనందం, సంబు రం ఇంకా ఎందులో ఉంటుంది? నడక, నవ్వూ, ప్రకృతి ఆస్వాదన మానసిక వికాసానికి సోపానాలు. తిరిగి తిరిగి ఇంటికొచ్చి కాస్తా నిమ్మరసంలో చెమ్చా తేనే కలుపుకొని తాగితే ఉండే హాయి….. హూ….. హవా…..
అన్నవరం దేవేందర్
వ్యాసకర్త, రచయిత కవి