పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
తప్పిన ముప్పు
పెద్దపల్లి,ఆగస్ట్25(జనం సాక్షి): పెద్దపల్లి మండలం రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు బ్రేక్ ఫేల్ కావడంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు.పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.



