పోగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీ చేరిన శ్యాంసన్ రాజ్
బిజెపిని వదిలి సొంత గూటికి చేరిన జి.పద్మా శాంసన్ రాజ్,
కంటోన్మెంట్ జూలై జనం సాక్షి కంటోన్మెంట్ లోని రసూల్ పుర అవంతి కాలనీలో ఉన్న తనకార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరులసమావేశంలో కంటోన్మెంట్ బోర్డ్ రెండవ వార్డ్ బిజెపి నాయకుడు జి.పద్మ,శ్యాంసన్ రాజ్. బిజెపిని వదిలి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన జి.పద్మా శాంసన్ రాజ్, అనంతరo విలేకరుల సమావేశం మాట్లాడుతూ కంటోన్మెంట్ బిజెపి పార్టీలో ఆదిపత్య పోరు ఎక్కువగా ఉందని ద్వితీయ శ్రేణి పార్టీ కార్యకర్తలు, నాయకుడును ఎదవకుండా చేస్తున్నారని,ఎంతకి పరిస్థితులు అనుకూలించక పోవడంతో తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ తో సాధ్యమని,ప్రజలకు అభివృద్ధి జరిగేది కాంగ్రెస్ తోనేనని అందుకని తిరిగి తాను బిజెపి నుండి మళ్లీ కాంగ్రెస్ కి వచ్చేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిడమర్తి రవి మాట్లాడుతూ రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో వస్తుందని ప్రజలకు అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమైతుందని,శాంసన్ రాజ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటిలోకి రావడం సంతోషమని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన అందరు సమిష్టిగా పని చేసి తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని,ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని నాయకులను తెలియజేశారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలను మార్చి ప్రవేశపెట్టినవేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే పేద ప్రజలకు సంక్షేమం కోసమే పాటు పడుతుందని చెప్పారు.గ్యాస్ ధర తగ్గిస్తారని ప్రతి ఒక్కరికి అతి డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఉద్యమకారులకు పెన్షన్లను కూడా ఇప్పిస్తామని తెలియజేసారు.అనంతరం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు జర్రిపోతుల సాయన్న, యేసు రత్నం,మహేష్ తదితరులు ఉన్నారు.