పోడు భూములను పరిశీలించిన అధికారులు

బాన్సువాడ, అక్టోబర్ 12 (జనంసాక్షి):
మండలంలోని రాంపూర్ తాండ శివారులో పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో బుధవారం అధికారులు అటవీ హక్కుల కమిటీ సభ్యులతో కలిసి భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ప్రకాష్, అటవీ హక్కుల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కిషన్, ,అంబర్ సింగ్, రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు.