పోడు భూముల సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గోపి

ఖానాపురం అక్టోబర్18జనం సాక్షి
   మండలాలలో పోడు భూముల క్లెయిమ్స్ పరిశీలన సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ గోపి పరిశీలించారు,మండలంలోని కిర్యతండా లో పోడు భూముల సర్వే  జరుగుతున్న పరిశీలన, వివరాల సేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు,ఈ సంద ర్భంగా అధికారులకు,ఎఫ్ ఆర్ సి కమిటీలకు స్థానిక ప్రజా ప్రతి నిధులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ, అర్హులైన పోడు వ్యవసాయ దారు లందరికి పట్టాలు అందించే విధంగా ఎఫ్ ఆర్ సి కమిటీలు ప్రజా ప్రతినిధుల సమన్వ యంతో గ్రామ, మండల స్థాయి అధికారులకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు,అటవీ రెవె న్యూ శాఖ సమన్వయంతో తమ రికార్డులు ,మ్యాప్ ద్వారా భూ వివరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు, ఆన్ లైన్ లో వచ్చిన ప్రతి క్లైమ్ ను పరిశీలించాలని తదను గుణంగా సర్వే బృందం పనిచేయాలని కలెక్టర్ అన్నారు,గ్రామ మండల స్థాయి లో పరిష్కారం కానీ సమస్య లను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తేవాలన్నారు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7700 క్లైమ్ లు అందాయని,
 ఇప్పటివరకు 450 పూర్తి చేశామని మరో రెండు నుంచి మూడు వారాల్లోమిగతావి కూడా పూర్తి చేస్తామని అన్నారు.
ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందజేస్తామన్నారు.,స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ మండల స్థాయి అధి కారులకు పూర్తిగా సహకరించి పరిశీలన ప్రక్రియను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు,ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ లు హరి సింగ్,మహేందర్ జి,డిఆర్డిఎ పిడి సంపత్ రావు,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్రావు, తాసిల్దార్ సుభాషిని,  ఎంపీడీవో సుమున వాణి, వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్రెడ్డి, ఎఫ్ ఆర్ వో రమేష్, సర్పంచ్  హట్యా నాయక్, పంచాయతీ సెక్రెటరీ,ఎఫ్ ఆర్ సి  కమిటీ  సభ్యులుగ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.