పోడు సమస్యలపై అటవీ అధికారులతో సమీక్ష…
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి);
కామారెడ్డి కలెక్టర్ వద్ద బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. మంత్రికి మొక్కను అందజేశారు. ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మంత్రికి మొక్కలను అందజేశారు. పోడు సమస్యలపై జిల్లా అటవీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చారు.