*పోతాయిపల్లి అడవిలో పిడుగు పడి 20 మేకలు మృతి
లింగంపేట్ 09 సెప్టెంబర్ (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో శుక్రవారం పిడుగు పడి 20 మేకలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన ఎర్రగొల్ల చిన్న రాములు తన 20 మేకలను తీసుకొని అడవికి వెళ్ళాడు మధ్యాహ్నం మూడు గంటలకు పోతాయిపల్లి గట్టు ప్రాంతంలో మేస్తున్న మేకల పై పిడుగు పడటంతో అక్కడి కక్కడే 20 మేకలు మృతి చెందినట్లు వారు తెలిపారు.బాదితున్ని ఆర్థికంగ ఆదుకొవాలని గ్రామస్తులు అదికారులను కోరారు.