పోరాడితేనే పోడు భూములు

అమరుల త్యాగాల ఫలితమే ఈ పోడు భూములు:ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య.

కొత్తగూడ నవంబర్ 8 జనంసాక్షి:భూమికోసం భుక్తి కోసం కొనసాగుతున్న గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్మారక బహిరంగ సభ భారత విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ మాసానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది.ఈ మాసం లోనే అనేకమంది అగ్రశ్రేణి నాయకత్వం నేలకొరిగారు.మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అరుణోదయ సాంస్కృతిక సమైక్య బృందంచే డప్పు చప్పుళ్లతో,నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం ఆవరణలో అమరవీరుల నవంబర్ మాసం….కామ్రేడ్ పాలడుగుల కృష్ణ 50వ స్మారక బహిరంగ సభలో భాగంగా జిల్లా నాయకులు వెంకటన్న ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభకు హాజరైన ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి ఏజెన్సీలో పేద ప్రజలు సాగుచేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారు.పేద ప్రజల ఉసురుపోసుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు లేవు,కామ్రేడ్ పాలడుగుల కృష్ణ ఏజెన్సీలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో త్యాగం చేశారు.పోరాడితేనే పోడు భూములు దక్కుతాయి.ఏజెన్సీ ప్రజలకు మూడు పూటలు తిండి తిన్నరంటే అది విప్లవ పార్టీలతోనే అని అన్నారు.నోరులేని ఆదివాసీలకు,పేదలకు చారెడు భూమి లభించింది.కార్పొరేట్ శక్తిలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు.అటవీ సంరక్షణ నియమాల పేరుతో సాధించుకొన్న చట్టాలను నీరు కార్చి,అటవీ భూములను,సంపదను పెట్టుబడిదారులకు దారాదత్తం చేయ జూస్తున్నారు.పోడు భూముల నుండి ఆదివాసీలను వెళ్ళ గొట్ట డానికి పూనుకొంటున్నారు.భూమి భూక్తి విముక్తి కోసం అశువులు బాసిన అమర వీరులను పేరు పేరునా స్మరించుకుందాం….పేద ప్రజలను అమాయకుల ను చేసి వారి చట్టాలను అమలు చేయడం లేదు.ఆదివాసుల కోసం ప్రాణాలు అర్పించిన పార్టీలు విప్లవ పార్టీలు మాత్రమే అని అన్నారు.ఆత్మగౌరవంతో బతకాలి కానీ బానిసల్ల ఆశపడొద్దని అన్నారు.పేద ప్రజలకు భూమి పంచిపెట్టింది ఏ పార్టీ కాసింత ఆలోచించండి.అమరవీరులను స్మరించుకోవడం అంటే వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం.ప్రజలు అనుభవిస్తున్న భూములు ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితమే అని గుర్తు చేశారు.పోడు భూముల హక్కుల కొరకు పాలకులను నీలదీయాలి.మహబూబాబాద్ జిల్లా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ పాలడుగుల కృష్ణన్నను నిర్ధాక్షిణ్యంగా హతమార్చారని అన్నారు.పోడు భూములకు నేటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రైతకు కూడా పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని,పైగా అటవీ అధికారులను ఉసిగొల్పి పోడు సాగు భూముల్లో పచ్చని పంటలను నాశనం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఓ వైపు పోడు సాగు భూములకు పట్టాలు అందజేస్తామంటూ మరో వైపు అటవీశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని భూములను దౌర్జన్యంగా లాకొంటున్నారని ఆరోపించారు.కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన గోదావరిలోయలో సాయుధ ప్రతిఘటనా పోరాటాలను నిర్మించి లక్షలాది ఎకరాల అటవీ భూములను ప్రజలకు సాధించిపెట్టారు.సీపీఐ ఎంఎల్ నాయకులు కామ్రేడ్ బూర్క వెంకన్న మాట్లాడుతూ అడవిలో చెట్టు కొట్టేది లేదు పాత పోడు వదులుకోమని భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసిన అమరులకు జోహార్లు అర్పించారు.ఏనాటికైనా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి విప్లవ పార్టీ పేద ప్రజల వైపునే పోరాటాలు చేస్తుందన్నారు.అగ్రనాయకులెందరో పీడిత ప్రజల విముక్తికోసం జీవితాలను అంకితం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు ఆగబోయిన నర్సక్క,ముస్మి సర్పంచ్ కల్తీ రమా వెంకన్న,లక్ష్మీపురం సర్పంచ్ సన్ప నరేష్,యుగేందర్,మంగన్న, పూనెం మోహన్ రావు,బుర్కా బుచ్చి రాములు,యాప వెంకన్న, వజ్జ సమ్మక్క, గట్టి సురేందర్, గజ్జి సోమన్న, గుగులోత్ హచ్య నాయక్,ఎన్ రాకేష్,బోనగిరి మధు లు విప్లవోద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమరవీరులకు జోహార్లు అర్పించారు.