పోలవరంతో రైతుల కష్టాలకు చెక్: నామన
కాకినాడ,జూన్13(జనం సాక్షి): పోలవరం ఎడమ కాలువ అందుబాటులోకొస్తే శ్రీకాకుళం వరకూ నీరు అందించే వెసులుబాటు ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. మ్యానిఫెస్టోలో లేని పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులను సైతం ప్రారంభించం ద్వారా టిడిపి రైతులకు మేలు చేసిందని తెలిపారు. టిడిపి అధికారంలోకొచ్చిన తర్వాత రైతులకు మేలు కలుగుతుందన్నారు. ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరం గురించి శ్రమిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కోనసీమ రైలు ప్రాజెక్టు, పిఠాపురం- కాకినాడ మెయిన్ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో యూత్ పాలసీని అమలు చేయబోతున్నారని దాని ద్వారా నిరుద్యోగులకుఎ నిరుద్యోగ భృతి అందించనున్నారని తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే మహానాడు వేదికగా ప్రకటించని తీరుగా అమలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి పనులను మాత్రం విస్మరించట్లేదన్నారు. కాపులకు ఇచ్చిన హావిూ మేరకు కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 24వేల కోట్లు కేటాయించి రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు.